టీచర్లు లేరని స్కూల్ కు తాళం..ఉపాధ్యాయులను నియమించాలని గ్రామస్తుల డిమాండ్

టీచర్లు లేరని స్కూల్ కు తాళం..ఉపాధ్యాయులను నియమించాలని గ్రామస్తుల డిమాండ్

అమ్రాబాద్, వెలుగు : టీచర్లు లేరని స్కూల్ గేట్​కు తాళం వేసి గ్రామస్తులు నిరసన తెలిపారు. ఈ ఘటన నాగర్​కర్నూల్  జిల్లా పదర మండలం ఇప్పలపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. ఇప్పలపల్లి, గానుగుపెంట గ్రామాలకు ఒకే పాఠశాల ఉంది. ఇక్కడ సుమారు 110 మంది పిల్లలు ఉండగా, ఏడుగురు టీచర్స్ ఉన్నారు. వీరిలో ఇద్దరు లీవ్ లో ఉండగా, 2 నెలల కింద టీచర్ల సర్దుబాటు పేరుతో ఒకరిని మద్దిమడుగు స్కూల్ కు, మరొకరిని మారడుగు గ్రామానికి పంపించారు. దీంతో ప్రస్తుతం ముగ్గురు టీచర్లే పని చేస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పేరెంట్స్​ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి టీచర్లను నియమించాలని కోరారు.