- సివిల్స్ అభయ హస్తం 2వ విడతపై సింగరేణి సీఎండీ ప్రకటన
హైదరాబాద్, వెలుగు: యూపీఎస్సీ పరీక్షలో ఇంటర్వ్యూకు ఎంపికైన తెలంగాణ అభ్యర్థులకు ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం’ పథకం కింద రెండో విడతగా రూ.1 లక్ష ఆర్థిక ప్రోత్సాహకం అందజేయనున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ మంగళవారం ప్రకటించారు.
గతంలో స్కీమ్ సమాచారం అందక దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఇప్పుడు వారికి కూడా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మెయిన్స్ దశలో రూ.1 లక్ష పొందిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, కానీ కొత్తగా ఇంటర్వ్యూ దశకు ఎంపికైన తెలంగాణ అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నెల 21 లోపు హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
