చెరువుల పునరుద్ధరణపై సీఎంకు థాంక్స్ : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

చెరువుల పునరుద్ధరణపై సీఎంకు థాంక్స్ : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

మాదాపూర్​, వెలుగు: భవిష్యత్తు తరాలకు ఆస్తులు కాకుండా, మంచి వాతావరణం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. హైడ్రా తీసుకువచ్చి చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవడంపై సీఎం రేవంత్​రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం మాదాపూర్​లోని తమ్మిడి కుంట చెరువు వద్ద మాదాపూర్​ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించారు. 

టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్ చైర్మన్ సామ రాంమోహన్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం నీటి వనరుల రక్షణపై స్టూడెంట్స్​తో ప్రతిజ్ఞ చేశారు.