మాయమవుతున్న మానవ సంబంధాలపై సినిమానే ‘ఖైదు’

మాయమవుతున్న మానవ సంబంధాలపై సినిమానే ‘ఖైదు’

మేకా  రామకృష్ణ  ప్రధాన పాత్ర పోషిస్తూ నిర్మించిన చిత్రం ‘ఖైదు’. రేఖా నిరోషా, శివ మేడికొండ హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ పులిజాల దర్శకత్వం వహించాడు. నవంబర్ 28న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రకాష్ మాట్లాడుతూ ‘మాయమవుతున్న మానవ సంబంధాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించాం. 

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు. ఈ కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పూర్తి నమ్మకంతో ఉన్నామని నటుడు, నిర్మాత మేకా రామకృష్ణ చెప్పారు. డాక్టర్ ఆరూరి సుధాకర్, వైభవ్ సూర్య, రంగయ్య , శివాజీ మేడికొండ, జోగారావు,  రవి, వర్షశ్రీ నటించిన ఈ చిత్రానికి  ఎస్.ఎన్.నజీర్ సంగీతం అందించాడు.