పథకం అమలుకు ప్రణాళికలు రెడీ చేయండి : కలెక్టర్ సంతోష్

పథకం అమలుకు ప్రణాళికలు రెడీ చేయండి : కలెక్టర్ సంతోష్
  •     కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు : ప్రధానమంత్రి ధన్ ధ్యాన కృషి యోజన పథకం అమలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో పీఎం ధన్ ధాన్య కృషి యోజన కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల్లో కొనసాగుతున్న ప్రస్తుత అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం లక్ష్యమన్నారు. జిల్లాలో ఈ స్కీములు అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అనంతరం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవానికి సంబంధించిన వాల్ పోస్టర్లను కలెక్టర్ రిలీజ్ చేశారు. 

సమావేశంలో జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ సక్రియనాయక్, అడిషనల్ డీఆర్డీఏ శ్రీనివాసులు, మార్కెటింగ్ ఆఫీసర్ పుష్పమ్మ, ఉద్యానవన ఆఫీసర్ అక్బర్, పరిశ్రమల మేనేజర్ రామలింగేశ్వర గౌడ్, ఎల్ డీఎం శ్రీనివాసరావు, ఫిషరీ ఏడీ షకీలాభాను, వెటర్నరీ ఆఫీసర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరగాలి


ఇటిక్యాల, వెలుగు : ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా సజావుగా జరగాలని కలెక్టర్ సంతోష్ అధికారులకు సూచించారు. మంగళవారం ఎర్రవల్లి మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటివరకు రైతుల నుంచి ఎంత ధాన్యం కొనుగోలు చేశారో నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.