కేసీఆర్ ఫామ్హౌజ్కే పరిమితం : మాజీ ఎమ్మెల్యే గువ్వల

కేసీఆర్ ఫామ్హౌజ్కే పరిమితం : మాజీ ఎమ్మెల్యే గువ్వల
  •     మాజీ ఎమ్మెల్యే గువ్వల 

  
అచ్చంపేట, వెలుగు :
పదేండ్లు సీఎంగా పని చేసిన కేసీఆర్ ను ఫామ్ హౌజ్ కే పరిమితం చేసిన ఘనత హరీశ్ రావు, కేటీఆర్ కే దక్కిందని, ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గువ్వల బాలరాజ్ అన్నారు. 

మంగళవారం అచ్చంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష పాత్రను కేసీఆర్ పూర్తిగా మరిచారన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సమావేశంలో బీజపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు మంగ్యా నాయక్, బాలాజీ, రేనయ్య, ఆంజనేయులు, శంకర్ మాదిగ, రామచంద్రయ్య , రామోజీ తదితరులు  పాల్గొన్నారు.