పోషణ్ స్కీమ్ను వంద శాతం అమలు చేయాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

పోషణ్ స్కీమ్ను వంద శాతం అమలు చేయాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
  •     కలెక్టర్ ఆదర్శ్​ సురభి

వనపర్తి, వెలుగు : ప్రధానమంత్రి పోషణ్ స్కీమ్ ను జిల్లాలో వంద శాతం అమలు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లో మండల విద్యాధికారులు, క్లస్టర్ హెడ్మాస్టర్లు, ఎస్​వోలు, విద్యాశాఖ ఏఈలతో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూడైస్ ప్రకారం రాష్ట్రంలో వనపర్తి జిల్లా చాలా వెనుకబడిందన్నారు. ఎంఈవోలు బాగా పనిచేయడం వల్ల అపార్ నమోదు, డ్రాప్ బాక్స్ వంటి పారామీటర్లలో ప్రగతి సాధించిందని తెలిపారు. చలికాలంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా హాస్టల్స్ కిటికీలు, తలుపులకు మరమ్మతులు చేయించాలన్నారు. 

పాఠశాలల్లో వంటలకు సిలిండర్లనే ఉపయోగించాలని చెప్పారు. స్కూళ్లలో బాత్​రూమ్స్, కిచెన్ షెడ్, ఇంటర్నెట్, ప్రహరీ గోడ, గార్డెన్ వంటి మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. వసతులు లేని పాఠశాలల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని, జీసీడీవో శుభలక్ష్మి, అధికారులు తదితరులు  పాల్గొన్నారు.