- మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల
కరీంనగర్ టౌన్, వెలుగు: పత్తి కొనుగోలు కేంద్రాలు(సీసీఐ)లను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేసే కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాలో పాల్గొని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్‌కు వినతిపత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, అసమర్థతతో పత్తి కొనుగోళ్లు ఆపేశారని ఆరోపించారు. దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎల్, ఎల్1, ఎల్2 నిబంధనల్ని, ఎకరానికి 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయనున్న రూల్స్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్యే రవిశంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, సిటీ అధ్యక్షుడు హరిశంకర్, మాధవి పాల్గొన్నారు.
