‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాకు వస్తోన్న రెస్పాన్స్‌తో హ్యాపీగా ఉన్నామని టీమ్ చెబుతోంది. విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదల కాగా, అన్ని సెంటర్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చిందని అన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌కు అతిథిగా హాజరైన నిర్మాత లగడపాటి శ్రీధర్ టీమ్‌కు సక్సెస్ షీల్డ్‌లను అందించి.. ఇదొక హెల్దీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ప్రశంసించారు. మూవీ కోసం పడిన కష్టాన్ని మర్చిపోయే విజయాన్ని ప్రేక్షకులు అందించారని హీరో విక్రాంత్, దర్శకుడు సంజీవ్ రెడ్డి అన్నారు. తన పాత్రకు మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉందని చాందినీ చౌదరి చెప్పింది. పాజిటివ్ రివ్యూస్‌తోపాటు తమ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయని నిర్మాతలు తెలిపారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
