ఇల్లు కొనేముందు ఇవి గమనించండి

ఇల్లు కొనేముందు ఇవి గమనించండి

న్యూఢిల్లీ: పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌లో ఇల్లు కొనుక్కోవాలనుకునేవారికి బ్యాంకులు, వివిధ ఫైనాన్షియల్ సంస్థలు మంచి ఆఫర్స్‌‌‌‌‌‌‌‌ ప్రకటిస్తున్నాయి. కానీ, ఇల్లు కొనుక్కునే ముందు వివిధ అంశాలను  జాగ్రత్తగా గమనించాలి. 

1. హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారు ఏ ఫైనాన్షియల్ కంపెనీ మంచి ఆఫర్ ప్రకటించిందో విశ్లేషించాలి. ఉదాహరణకు హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ‘ఫెస్టివ్ ట్రీట్స్‌‌‌‌‌‌‌‌’ క్యాంపెయిన్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్ చేసింది. బ్యాంక్ కస్టమర్లు, ఇతర బ్యాంకుల కస్టమర్లు కూడా ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌ హోమ్‌‌‌‌‌‌‌‌లోన్‌‌‌‌‌‌‌‌ తీసుకోవచ్చని చెబుతోంది. 8.35 శాతం వడ్డీ రేటుకి హోమ్‌‌‌‌‌‌‌‌లోన్ ఆఫర్ చేస్తోంది. ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. అలానే పీఎన్‌‌‌‌‌‌‌‌బీ, బ్యాంక్ ఆఫ్​ బరోడా కూడా స్పెషల్ హోమ్‌‌‌‌‌‌‌‌ లోన్ ఆఫర్లను ప్రకటించాయి. 8.40 శాతం వడ్డీ రేటు నుంచి హోమ్‌‌‌‌‌‌‌‌ లోన్ ఇస్తున్నాయి. క్రెడిట్ స్కోర్ బాగున్న వాళ్లకి తక్కువ వడ్డీకి హోమ్‌‌‌‌‌‌‌‌ లోన్లు ఇస్తున్నాయి.

2. ఇల్లు కొనే ముందు డౌన్‌‌‌‌‌‌‌‌ పేమెంట్‌‌‌‌‌‌‌‌ కోసం డబ్బులు సేవ్ చేసుకోవాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. ప్రాపర్టీ వాల్యూలో 10–30 శాతం వరకు డౌన్‌‌‌‌‌‌‌‌పేమెంట్ చెల్లించేలా డబ్బులు పొదుపు చేసుకోవాలని అన్నారు. డౌన్‌‌‌‌‌‌‌‌ పేమెంట్ ఎక్కువ కడితే హోమ్‌‌‌‌‌‌‌‌ లోన్ భారం తక్కువ పడుతుందని చెప్పారు. 

3. బిల్డర్ల బ్యాక్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ను జాగ్రత్తగా చెక్ చేయాలి. ఇల్లు ఎంచుకోవడంలో  బిల్డర్ల ట్రాక్ రికార్డ్‌‌‌‌‌‌‌‌, పేరు ప్రతిష్టలు  కీలకంగా ఉంటాయి. 

4. రెరా వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో మీరు కొనాలనుకుంటున్న ఇల్లు గురించి చెక్ చేసుకోవాలి.  ‘మొదట   ప్రాజెక్ట్ ప్లాన్‌‌‌‌‌‌‌‌ను చెక్‌‌‌‌‌‌‌‌ చేయాలి. ఆ తర్వాత ఆర్కిటెక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి,  గతంలో వీరు పాల్గొన్న ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ల వివరాలు తెలుసుకోవాలి’ అని నిపుణులు పేర్కొన్నారు. బిల్డర్ హ్యాండోవర్ చేస్తానన్న డేట్‌‌‌‌‌‌‌‌ను కూడా రెరా వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో చెక్ చేసుకోవాలని చెప్పారు. అలానే బిల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన ప్రాజెక్ట్ కోసం ఏడాదికి 16 శాతం కంటే ఎక్కువ వడ్డీకి ఫండ్స్‌‌‌‌‌‌‌‌ సేకరిస్తే ఆ బిల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉండడం మంచిది.

 ALSO READ : ఈవీల దిగుమతిపై తగ్గనున్న సుంకాలు​..ప్రపోజల్​ను పరిశీలిస్తున్న కేంద్రం

5. డెవలపర్లు ఇచ్చే డిస్కౌంట్‌‌‌‌‌‌‌‌లు,  ఆఫర్లకు ఆకర్షితులవ్వొద్దు. ప్రాపర్టీ అసలు విలువను లెక్కించాకే , మీరు సంతృప్తి పడ్డాకనే కొనడానికి ఆసక్తి చూపించాలి. 

6. ఆర్థిక స్తోమతకు తగ్గట్టు   ఇల్లు కొనుక్కోవాలి. బ్యాంకులకు చెల్లించే ఈఎంఐలు తట్టుకునేటట్టు ఉండాలి.