పీనల్ చార్జీలపై కొత్త రూల్స్ ఏప్రిల్‌‌ 1 తర్వాతనే : రిజర్వ్ బ్యాంక్‌‌

పీనల్ చార్జీలపై  కొత్త రూల్స్ ఏప్రిల్‌‌ 1 తర్వాతనే :  రిజర్వ్ బ్యాంక్‌‌

న్యూఢిల్లీ: లోన్ అకౌంట్లకు సంబంధించి వేసే పీనల్ చార్జీల రూల్స్‌‌ను ఆర్‌‌‌‌బీఐ  సవరించగా, వీటిని అమలు చేయడానికి బ్యాంకులకు, ఎన్‌‌బీఎఫ్‌‌సీలకు మరో మూడు నెలల టైమ్ దొరికింది. జనవరి 1 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రావాలి. కానీ, ఏప్రిల్ 1 వరకు ఆర్‌‌‌‌బీఐ టైమ్ పొడిగించింది.  ‘బ్యాంకులు, ఎన్‌‌బీఎఫ్‌‌సీలు  ఏప్రిల్‌‌ 1 నుంచి ఇచ్చే అన్ని ఫ్రెష్‌‌ లోన్స్‌‌పై  కొత్త పీనల్ చార్జీ రూల్స్‌‌ అమలు చేయాలి’ అని ఓ సర్క్యులర్‌‌‌‌లో పేర్కొంది. 

అదే ఇప్పటికే ఇచ్చిన లోన్లకు సంబంధించి  కొత్త రూల్స్‌‌కు మారడంపై ఏప్రిల్‌‌ 1 తర్వాత రివ్యూ చేయాలని తెలిపింది. కొత్త రూల్ ప్రకారం, లోన్ కాంట్రాక్ట్‌‌లోని  కండిషన్స్‌‌ ఫాలో కాకపోతే  బారోవర్లపై వేసే చార్జీలను ‘పీనల్ చార్జీలుగా’ పరిగణించాలి. అంతేకాని పీనల్ ఇంట్రెస్ట్‌‌గా చూడకూడదు. ఈ చార్జీ అప్పుల వడ్డీలపై  కూడా పడుతుంది.  రూల్స్‌‌ పాటించకపోతే తీవ్రతను బట్టి పీనల్ చార్జీ ఉండాలి. పీనల్ చార్జీలపై అదనంగా వడ్డీ వసూలు చేయకూడదు.