
న్యూఢిల్లీ: జీతాలను త్వరగా పెంచాలనే డిమాండ్‌తో ఈ నెల 31, వచ్చే నెల ఒకటో తేదీల్లో సమ్మె చేస్తామని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ప్రకటించాయి. 2017 నవంబరు నుంచి ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగుల జీతాలు మారలేదు. వేతన సవరణ త్వరగా చేపట్టకుంటే సమ్మె తప్పదని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ తదితర యూనియన్లు స్పష్టం చేశాయి. వచ్చే నెల ఒకటిన బడ్జెట్ ప్రవేశపెడుతుండగా, అదేరోజు సమ్మెకు దిగుతామని యూనియన్ నాయకులు హెచ్చరించడం గమనార్హం.