ఈరోజు నుండే ‘లోన్‌‌మేళా’ ప్రారంభం

ఈరోజు నుండే ‘లోన్‌‌మేళా’ ప్రారంభం

న్యూఢిల్లీ: దేశంలోని తొలి దశ ‘లోన్‌‌ మేళా’ ప్రోగ్రామ్‌‌ నేటి నుంచి మొదలవనుంది. దేశంలోని 250 జిల్లాల్లో లోన్‌‌ మేళా ప్రారంభం కానుంది. రిటైల్‌‌ కస్టమర్లు, ఎంఎస్‌‌ఎంఈలకు అవసరమైన అప్పులు సమకూర్చే ఉద్దేశంతో బ్యాంకుల సహకారంతో ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్‌‌ను తలపెట్టింది. నాలుగు రోజులపాటు సాగే ఈ ప్రోగ్రామ్‌‌లో భాగంగా రిటైల్‌‌, అగ్రికల్చర్‌‌, వెహికిల్‌‌, హోమ్‌‌, ఎంఎస్‌‌ఎంఈ, ఎడ్యుకేషన్‌‌తోపాటు, పర్సనల్‌‌ లోన్స్‌‌ను స్పాట్‌‌లోనే బ్యాంకులు ఇవ్వనున్నాయి. స్టేట్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఎస్‌‌బీఐ), పంజాబ్‌‌ నేషనల్‌‌ బ్యాంక్‌‌, బ్యాంక్‌‌ ఆఫ్‌‌ బరోడా (బీఓబీ), కార్పొరేషన్‌‌ బ్యాంక్‌‌ సహా అన్ని బ్యాంకులు ఈ లోన్‌‌ మేళాలో భాగం పంచుకుంటున్నాయి. ఫెస్టివల్‌‌ సీజన్‌‌ డిమాండ్‌‌ తట్టుకునేందుకు సిద్ధమై ప్రోగ్రామ్‌‌లో బ్యాంకులు పాల్గొంటున్నాయి.  దేశంలోని 48 జిల్లాల్లో లీడ్‌‌ బ్యాంకర్‌‌గా ఎస్‌‌బీఐ వ్యవహారిస్తుండగా, మరో 17 జిల్లాల్లో బీఓబీ వ్యవరిస్తోంది. బరోడా కిసాన్‌‌ పఖ్వాడా పేరిట మరో సొంత ప్రోగ్రామ్‌‌నూ రైతుల కోసం బీఓబీ నిర్వహించనుంది. గుర్తించిన 400 జిల్లాల్లో అవుగ్‌‌రీచ్‌‌ ప్రోగ్రామ్స్‌‌ నిర్వహించాలని ఇటీవల జరిగిన రివ్యూలో బ్యాంకులు నిర్ణయించాయి. ఇందులో భాగం పంచుకోవడానికి ప్రైవేటు రంగ బ్యాంకులూ ముందుకు వచ్చాయి.