Bank Holidays: జూలైలో బ్యాంక్స్ 13 రోజులు క్లోజ్.. ఏఏ తేదీల్లో అంటే..?

Bank Holidays: జూలైలో బ్యాంక్స్ 13 రోజులు క్లోజ్.. ఏఏ తేదీల్లో అంటే..?

July Bank Holidays 2025: నేటితో జూలై నెల ప్రారంభం అయ్యింది. కొత్త నెలలో బ్యాంకులు పనిచేసే రోజులు, వాటికి ఉండే సెలవును ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమ రుణ అవసరాలు, ఇతర చెల్లింపులకు వెళ్లేముందు వీటిని గమనించాలి. రిజర్వు బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ప్రాంతంలో ఉండే బ్యాంకింగ్ సెలవులు ప్రతి నెల మారిపోతుంటాయి.

అయితే జూలై మాసంలో బ్యాంకులు దేశవ్యాప్తంగా దాదాపు 13 రోజుల పాటు క్లోజ్ అయి ఉండనున్నాయి. అలాగే ప్రతి రెండవ, నాల్గవ శనివారం కూడా బ్యాంక్స్ శెలవులో ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జూలై నెలలో బ్యాంకు సెలవుల వివరాలు..

* జూలై 3 (గురువారం) – త్రిపుర: ఖర్చీ పూజ సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
* జూలై 5 (శనివారం) – జమ్మూ మరియు శ్రీనగర్: గురు హరగోవింద్ జీ పుట్టినరోజు సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
* జూలై 13 రెండవ శనివారం సెలవు
* జూలై 14 (సోమవారం) - మేఘాలయ: బే దేఖ్లాం పండుగ సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
* జూలై 16 (బుధవారం) – ఉత్తరాఖండ్: హరేలా పండుగ సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
* జూలై 17 (గురువారం) – మేఘాలయ: యు తిరోత్ సింగ్ వర్ధంతి సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
* జూలై 19 (శనివారం) – త్రిపుర: కేర్ పూజ కారణంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
* జూలై 27 నాల్గవ శనివారం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి.
* జూలై 28 (సోమవారం) – సిక్కిం: ద్రుక్పా ఛే-జీ పండుగ కారణంగా బ్యాంకులు మూసివేయబడతాయి.

అయితే ప్రస్తుతం ప్రజలకు ఎక్కువగా డిజిటల్ చెల్లింపులపై అవగాహన పెరగటంతో బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతోంది. అయితే బ్యాంకులు అందుబాటులో లేనప్పటికీ ఎంటీఎం సేవలు, డిజిటల్ చెల్లింపులు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటివి అందుబాటులో ఉన్నందున ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను కొనసాగించవచ్చు. అయితే కొన్ని ముఖ్యమైన పనులకు మాత్రం బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటున్నందున సెలవులను ముందుగానే చూసుకుని బ్యాంక్ విజిట్ ప్లాన్ చేసుకోవటం మంచిది.