
అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామాపై బిలియనీర్ ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బరాక్ ఒబామా పెళ్లాడింది మహిళను కాదు.. పురుషుడినని అన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక 'క్వీర్', ఆయన పెళ్లి చేసుకుంది స్త్రీలా దుస్తులు ధరించిన ఒక వ్యక్తిని.. అని ఎర్రోల్ మస్క్ 'వైడ్ అవేక్ పాడ్‌కాస్ట్'లో వ్యాఖ్యానించారు. బరాక్ ఒబామాకు నటి జెన్నిఫర్ అనిస్టన్ తో ఎఫైర్ ఉందని పుకార్లు వస్తున్న నేపథ్యంలో మస్క్ తండ్రి ఈ వింత వాదన చేశారు.
ఎలాన్ మస్క్ తండ్రి వ్యాఖ్యలతో ఆశ్చర్యపోయిన హోస్ట్ జాషువా రూబిన్.. “మిచెల్ ఒబామా ఒక పురుషుడా?” అని అడగ్గా.. దానికి ఎర్రోల్, “అయితే, మీకు అది తెలియదా? మీరు దానిని ఏ ఇంటర్నెట్‌లోనైనా చూడవచ్చు. మిచెల్ ఒబామా ఒక పురుషుడు” అని బదులిచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
బరాక్ ఒబామా.. భార్య మిచెల్‌ను 1989లో ఒక న్యాయ సంస్థలో కలిశారు. వీరిద్దరూ 1992లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. మాలియా (26), సాషా (23).