
హైదరాబాద్: చాలా రోజుల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ముళ్ల కంచెలు తొలగించారు. గత పదేళ్లుగా ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ చుట్టూ ఉన్న ముళ్ల కంచెలు గురువారం ( డిసెంబర్ 21) తొలగించారు అధికారులు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల పోరాటంతో ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ చుట్లూ ముళ్ల కంచెలు తీసివేసేందుకు ఓయూ అధికారులు ఒప్పుకున్నారు..దగ్గరుండి ముళ్ల కంచెలు తీసివేయించారు ఓయూ అధికారులు, ఇన్ స్పెక్టర్ ఆంజనేయులు.
2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..పదేళ్ల పాటు ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, ఆందోళనలు నిషేధించింది. ఓయూ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ముందు గేటుకు ముళ్లకంచెలు వేశారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాలపై నిరంకుశంగా బీఆర్ ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విద్యార్థులు మండిపడ్దారు.
క్యాంపస్ పై ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వందలాది మంది విద్యార్థులు గురువారు (డిసెంబర్15) ఓయూ లైబ్రరీ నుంచి అడ్మినిస్ట్రేషన్ భవనం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు తమ సమస్యలు వినిపించకుండా విద్యార్థులు భవనంలోకి ప్రవేశంచకుండా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ చుటూ ఉన్న ముళ్ల కంచెలు తొలగించాలని వారి డిమాండ్ చేశారు. దీంతో దిగివచ్చిన ఓయూ అధికారులు ముళ్ల కంచెలను దగ్గరుండి తొలగించారు.