జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ పైప్‌లైన్ రోడ్డులో చీప్ ఆండ్ బెస్ట్ పేరుతో ఓ కార్పొరేట్ సంస్థ సెలూన్‌ను ఏర్పాటు చేసింది. దీంతో ఓం మణికంఠ నాయీబ్రహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం సెలూన్ ఎదుట ధర్నా నిర్వహించారు.
కార్పొరేట్ సెలూన్స్ హటావో, నాయీబ్రాహ్మణ్ కో బచావో అంటూ నినాదాలు చేశారు. కార్పొరేట్ సెలూన్ల వల్ల నాయీబ్రాహ్మణుల కులవృత్తి ప్రమాదంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు బీజేపీ మేడ్చల్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి మద్దతు పలికారు.
