ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ ఉమెన్స్ డ‌బుల్స్ విజేత చెక్‌రిప‌బ్లిక్ జంట

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ ఉమెన్స్ డ‌బుల్స్ విజేత  చెక్‌రిప‌బ్లిక్  జంట

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ మ‌హిళ‌ల డ‌బుల్స్ ఫైనల్లో  బ‌ర్బొరా క్రెజ్సికోవ - క‌టేరిన సినియ‌కోవ జోడీ విజయం సాధించింది.  ఫైన‌ల్లో షుకో ఓయ‌మ - ఎనా షిబ‌హ‌రా (జ‌పాన్) జంటపై 6-4, 6-3 స్కోరు తేడాతో గెలుపొందింది. ఈ జోడీ వ‌రుస‌గా రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడం విశేషం. 

24 మ్యాచుల్లో ఓటమన్నదే ఎరుగని ఈ  వరల్డ్ నెంబర్ వన్ జంట..ఆస్ట్రేలియన్ ఓపెన్ లోనూ అదే జోరును కొనసాగించింది. ఇదే క్రమంలో క్రెజ్సికోవ – సినియకోవ అద్బుతమైన  షాట్లతో విరుచుకుప‌డుతూ మొద‌టి సెట్ను 6-తో దక్కించుకున్నారు. ఇదే దూకుడునేు రెండో సెట్లోనూ కొనసాగించి 6-3తో సెట్తో పాటు..మ్యాచ్ను కైవసం చేసుకున్నారు. 

క్రెజ్సికోవ – సినియకోవ జోడీ ఇప్పటి వరకు 7 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించింది. 2022లో ఆస్ట్రేలియ‌న్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లో టైటిళ్లను కైవసం చేసుకుంది.