
అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన బర్రెలక్క అలియాస్ శిరీష మంగళవారం నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కుటుంబసభ్యులతో కలిసి రిటర్నింగ్ ఆఫీసర్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. అలాగే గాలిముడి గీత, పిల్లెల శ్రీకాంత్, నేడిగొండ కృష్ణయ్య, పాలాది నాగరాజు, లంద భిక్షపతి తదితరులు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు.