బర్రెలక్కకు 5,754 ఓట్లు

బర్రెలక్కకు 5,754 ఓట్లు

నిరుద్యోగుల ప్రతినిధిగా కొల్లాపూర్​ బరిలో నిలిచిన బర్రెలక్క అలియాస్​ శిరీష ఓటమి పాలయినప్పటికీ  నైతికంగా గెలిచింది. 5,754 ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులను శిరీష టెన్షన్​ పెట్టింది. రాజకీయ వారసత్వం, ధనబలం లేకపోయినా ఆమె పోరాడి అందరినీ ఆకట్టుకున్నది. స్థానిక సమస్యలు, నిరుద్యోగంపై తన వాయిస్​ వినిపించింది.