మరో పిటిషన్ వేసేందుకు సిద్ధమైన బర్రెలక్క న్యాయవాదులు

మరో పిటిషన్ వేసేందుకు సిద్ధమైన బర్రెలక్క న్యాయవాదులు

కొల్లాపూర్ స్వతంత్ర్య అభ్యర్థి బర్రెలక్క అలియాస్ శిరీష పిటిషన్ విషయంలో న్యాయస్థానం ఆదేశాలను పోలీసు శాఖ లైట్ తీసుకున్నారు. తక్షణమే ప్రొటెక్షన్ ఇవ్వాలని కోర్టు ఆదేశించిన తెలంగాణ పోలీసులు పట్టించుకోవడం లేదు. ప్రొటెక్షన్ కల్పించాలని చెప్పినా.. ఇప్పటివరకు పోలీసులు స్పందించలేదని బర్రెలక్క న్యాయవాదులు చెబుతున్నారు. 

కోర్టు ఆదేశాలను సైతం తెలంగాణ పోలీస్ దిక్కరిస్తున్నారనే ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. ఈరోజు(నవంబర్ 25) కోర్టు ఆదేశాల ధిక్కరణ కింద.. బర్రెలక్క న్యాయవాదులు మరో పిటిషన్ వేసేందుకు సిద్ధం అవుతున్నారు.