బర్రెలక్కకు బంపర్ ఆఫర్.. బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్గా?

బర్రెలక్కకు బంపర్ ఆఫర్.. బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్గా?

ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ ఐన బిగ్ బాస్(Bigg boss) షో తెలుగులో కూడా సత్తా చాటింది. ఇప్పటికే 7 సీజన్లు కంప్లీట్  చేసుకున్న ఈ షో కొత్త సీజన్ కోసం సిద్దామవుతోంది. ఇటీవలే సీజన్ కూడా కంప్లీట్ అవగా.. ఆ సీజన్ లో కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. దీంతో కొత్త సీజన్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం మేరకు ఫిబ్రవరి, లేదా మార్చ్ లో బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలుకానుంది. 

అది కూడా బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ సీజన్2. దీంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు. అయితే ఈ సీజన్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 కోసం బర్రెలక్కను కంటెస్టెంట్ గా తీసుకురానున్నారట మేకర్స్. గత సీజన్ లో పల్లవి ప్రశాంత్ రాకతో బిగ్ బాస్ కు రికార్డ్ లెవల్లో టీఆర్ఫీ రేటింగ్ వచ్చింది. దీంతో అలాంటి కంటెస్టెంట్ ను మళ్ళీ రిపీట్ చేస్తే మంచి వ్యూవర్షిప్ వచ్చే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తున్నారట. అలా చేస్తే రూరల్ లో కూడా షో హిట్ అయ్యే అవకాశం ఉటుంది కాబట్టి ఆమెను ఎలా అయినా ఒప్పించేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. 

ఇక బర్రెలక్క విషయానికి వస్తే. ఆమె అసలు పేరు శిరీష. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ తోనే ఆమె  ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. ఎన్నికల్లో ఓడిపోయారు కానీ.. జనాల్లో మాత్రం ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ కారణంగానే ఆమె బిగ్ బాస్ కు వెళ్తున్నారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి నిజంగా బర్రెలక్క బిగ్ బాస్ కు వెళ్తున్నారా? లేదా? అనేది తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.