ఏపీలో రేషన్ డోర్ డెలివరీకి అడ్డంకులు..

ఏపీలో రేషన్ డోర్ డెలివరీకి అడ్డంకులు..
  • గిట్టుబాటు కావడం లేదంటున్న ఆపరేటర్లు
  • అనంతపురం జిల్లా గుంతకల్ లో వాహనాలు వాపస్

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటివద్దకే రేషన్ పథకానికి బ్రేకులు పడుతున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న వాహనాల నిర్వహణ డబ్బులు గిట్టుబాటు కావడంలేదంటూ అనంపురం జిల్లా గుంతకల్ లో ఆపరేటర్లు తమ వాహనాలను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. గుంతకల్ పట్టణంలో 20 డోర్ డెలివరీ వాహనాలు ఉండగా.. సగం మంది ఆపరేటర్లు తాహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి నిర్వహణ ఖర్చులు భరించలేమంటూ తిరిగి ఇచ్చేశారు. ప్రభుత్వం ఇస్తున్న నెలకు 21వేల రూపాయలు ఏ మాత్రం సరిపోవడం లేదని.. డీజిల్,హమాలీ ఖర్చులు పెరిగిపోయాయని.. ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు నెలనెలా కంతులు కట్టేందుకే సరిపోకపోవడం లేదని, అందుకే వాహనాలు వాపస్ ఇచ్చేశామని చెబుతున్నారు.