బార్లు, రెస్టారెంట్లు 24 గంటలు ఓపెన్​

బార్లు, రెస్టారెంట్లు  24 గంటలు ఓపెన్​

ఇకపై ఎప్పుడంటే అప్పుడు లిక్కర్, వేడివేడి ఫుడ్​దొరకనున్నాయి. బార్లు, రెస్టారెంట్లను 24 గంటలు నడుపుకునేందుకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. 24 గంటలు పనిచేసే కంపెనీల్లోని కార్మికులు వేడి ఆహారంతోపాటు లిక్కర్ కూడా కోరుకుంటున్నారని, వారి అవసరాలు తీర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా వెల్లడించారు. 

తగిన ఫీజు చెల్లించి నడుపుకునే షాపులపై ఎలాంటి ఆంక్షలు ఉండవని ఆయన తెలిపారు. అయితే, బార్లు, రెస్టారెంట్లు తెరిచి ఉన్నప్పటికీ సేఫ్టీ విషయంలో రాజీ పడబోమన్నారు. రెస్టారెంట్లు 24x7 పనిచేయడానికి ప్రభుత్వం పర్మిషన్​ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్టు ఐటీ ఎంప్లాయీస్​చెబుతున్నారు. ఇంటర్నేషనల్ స్థాయి కంపెనీలు 24 గంటలూ పని చేస్తాయని, వాటిలో షిఫ్ట్​ల వారీగా పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. ప్యాక్ చేసిన ఆహారాన్ని తినడం కంటే రాత్రిపూట రెస్టారెంట్లలో వేడి వేడి భోజనం చేయడం బాగుంటుంది కదా.. అని అభిప్రాయపడుతున్నారు.