Cricket World Cup 2023: పాక్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్న నెదర్లాండ్స్.. అతన్ని ఔట్ చేస్తేనే విజయం

Cricket World Cup 2023: పాక్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్న నెదర్లాండ్స్.. అతన్ని ఔట్ చేస్తేనే విజయం

వరల్డ్ కప్ లో పాకిస్థాన్- నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. మొదట బౌలింగ్ లో రాణించి పాక్ ని 286 పరుగులకే  కట్టడి చేసిన డచ్.. ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ పోరాడుతుంది. పటిష్టమైన పాక్ బౌలింగ్ ని సమర్ధవంతంగా ఎదర్కొంటూ 25 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ మ్యాచులో పాకిస్థాన్ గెలుపు ఖాయంగా కనిపిస్తున్నా.. నెదర్లాండ్స్ స్టార్ ప్లేయర్ బేస్ డీ లీడ్ ని ఔట్  చేయకపోతే పాక్ ఓడిపోయే ఛాన్స్ ఉంది. 

బేస్ డీ లీడ్ నెదర్లాండ్స్ జట్టులో స్టార్ ప్లేయర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. నెదర్లాండ్స్ తరపున ఎన్నో సంచలన ఇన్నింగ్స్ లు ఆడి ఊహించని విజయాలను తమ జట్టుకి అందించాడు. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో భాగంగా స్కాట్లాండ్ పై వీరోచిత సెంచరీ చేసి నెదర్లాండ్స్ ని వరల్డ్ కప్ కి అర్హత సాధించేలా చేసాడు. ఈ మ్యాచులో ఓ వైపు సహచరులు విఫలమవుతున్నా.. 92 బంతుల్లనే 123 పరుగులు చేసి చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. 

ఇక ప్రస్తుతం వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచులో హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయం కోసం పోరాడుతున్నాడు. తర్వాత కెప్టెన్ ఎడ్వార్డ్స్ కూడా ఉండడంతో నెదర్లాండ్స్ ని తక్కువగా అంచనా వేస్తే ప్రమాదమే. ముఖ్యంగా వీలైనంత త్వరగా  బేస్ డీ లీడ్ ని అవుట్ చేస్తేనే మ్యాచ్ పాక్ చేతుల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో పాక్ బౌలర్లు ఈ  స్టార్ ఆల్ రౌండర్ ని ఎలా నిలువరిస్తారో చూడాలి. కాగా.. ఈ  మ్యాచులో బేస్ డీ లీడ్ నాలుగు వికెట్లతో బౌలింగ్ లోనూ రాణించాడు.            
 

<