బాసర.. వర్గల్ ఆలయాల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు..చదువును ప్రారంభించిన చిన్నారులు

బాసర.. వర్గల్ ఆలయాల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు..చదువును ప్రారంభించిన చిన్నారులు

నిర్మల్ జిల్లా బాసర లో  వసంత పంచమి వేడుకలు ( 2026 జనవరి 23 ఉదయం 10 గంటల ప్రాంతంలో) ఘనంగా జరుగుతున్నాయి . సరస్వతి  అమ్మవారిని  బారీగా దర్శించుకుంటున్నారు భక్తులు.   ఉదయం‌‌ నుంచి చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలను చేయిస్తున్నారు.  సరస్వతి  అమ్మవారిని  బారీగా  భక్తులు దర్శించుకుంటున్నారు.  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు.. అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. తోపులాటలు జరుగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

సిద్దిపేట జిల్లా వర్గల్​ శ్రీ విద్య సరస్వతి ఆలయం కూడా భక్తులతో కిటకిలలాడుతోంది.  చదువుల తల్లి... సరస్వతి అమ్మవారి సన్నిదిలో అక్షరాభ్యాస కార్యక్రమాలు జరిగాయి.  

ALSO READ : హైదరాబాద్ లో మహిమ గల క్షేత్రం..

మెదక్ జిల్లాలో  ప్రసిద్ధి గాంచిన  శ్రీ వన దుర్గభవాని  అమ్మవారికి   శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని వసంత పంచమి సందర్బంగా   అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. వసంత పంచమిరోజున అమ్మవారి దివ్యదర్శనం కోసం  భక్తులు భారీగా  తరలి వచ్చారు.    సింగూరు నుండి నీళ్లు  విడులచేయడంతో ఆలయ ప్రాంగణంలో జలకళ కనిపిస్తుంది.భక్తులు ఉదయం నుండే అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు.