
- రూమ్లో ఉరివేసుకున్న భానుప్రసాద్
- మృతుడి స్వస్థలం రంగారెడ్డి జిల్లా మంచాల
- గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు
- నాలుగు నెలల్లో వర్సిటీలో ఇది రెండో ఘటన
నిర్మల్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీలో మరో స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. వర్సిటీలో చదువుతున్న రంగారెడ్డి జిల్లా మంచాలకు చెందిన పి.భానుప్రసాద్ ఆదివారం రాత్రి తన రూమ్లో ఉరివేసుకొని మృతి చెందాడు. అయితే.. గుట్టుచప్పుడు కాకుండా యూనివర్సిటీ అంబులెన్స్ లో భానుప్రసాద్ మృతదేహాన్ని తీసుకెళ్లి కుటుంబసభ్యులకు అప్పజెప్పినట్టు తెలుస్తున్నది.
రూమ్లో సూసైడ్ నోట్ లభించినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతోనే స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నట్లు వర్సిటీ వర్గాలు చెప్తున్నాయి. నాలుగు నెలల్లో యూనివర్సిటీలో ఇది రెండో ఆత్యహత్య. ఆగస్టు 23న సురేశ్ అనే స్టూడెంట్తన రూమ్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.