బాసర స్టూడెంట్స్ ను ఎమ్మెల్యేలు అవమానించారు

బాసర స్టూడెంట్స్ ను ఎమ్మెల్యేలు అవమానించారు

బీజేపీలో చేరిన మల్కాజిగిరి టీఆర్ఎస్ లీడర్లు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోయిండని అధికార పార్టీ నేతలే చర్చించుకుంటున్నారని బీజేపీ స్టేట్ ​చీఫ్ ​ఎంపీ బండి సంజయ్ అన్నారు. అధికారులను తీసుకెళ్లి అక్కడెందుకు రివ్యూలు చేస్తున్నాడని టీఆర్ఎస్​నేతలు మాట్లాడుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఎపుడు ఏమైతదో అని కేసీఆర్ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో  పలువురు డాక్టర్లతో పాటు మల్కాజిగిరి నియోజకవర్గం అల్వాల్ డివిజన్ టీఆర్​ఎస్ నాయకురాలు లావణ్య,  పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బాసర ట్రిపుల్​ఐటీలో విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై గతంలోనే   సీఎం కేసీఆర్ కు లేఖ రాసినా పట్టించుకోలేదని తెలిపారు. సీఎం మొద్దు నిద్రలో ఉన్నారని , విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేస్తే  మంత్రులు, ఎమ్యెల్యేలు అవమానకరంగా మాట్లాడారని మండిపడ్డారు. స్టూడెంట్ల సమస్యలు పట్టించుకోవడం లేదని దేశమంతా చర్చించుకుంటోందని చెప్పారు. బాసరలో విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన స్థానిక ఎంపీ  సోయం బాపూరావును పోలీసులు అడ్డుకోవడం సిగ్గు చేటన్నారు.  ఆయన  అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేసిన బీజేపీ  కార్యకర్త లపైకి పోలీసులు కారు ఎక్కించారని ఫైర్ అయ్యారు. ఎంపీని బేషరతుగా విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలు తెలుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాకపోతే తమకు అప్పగించాలని సంజయ్​​ సవాల్ విసిరారు.

సంజయ్ యాత్ర సహ ప్రముఖ్​గా జిట్టా

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేపడుతున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సహ ప్రముఖ్​గా జిట్టా బాలకృష్ణారెడ్డిని నియమిస్తున్నట్లు పార్టీ వైస్ ప్రెసిడెంట్, యాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్ రెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 2 నుంచి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి నుంచి ప్రారంభం కానుంది.

కళాకారులను.. ప్రభుత్వం పట్టించుకుంటలే: రాంచందర్

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులను టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత రాంచందర్ రావు ఆరోపించారు. ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని తమ కళల ద్వారా చాటి చెప్పారని గుర్తుచేశారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర పాటల సీడీని ఆదివారం పార్టీ స్టేట్ ఆఫీసులో ఆయన విడుదల చేసి మాట్లాడారు. బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మి చాలా మంది తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను పాటల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు.