మేడారం జాతరకు ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ సత్య శారదాదేవి

మేడారం జాతరకు ఏర్పాట్లు చేయాలి :  కలెక్టర్ సత్య శారదాదేవి

కాశీబుగ్గ, వెలుగు: మద్ది మేడారంలో జనవరి 28 నుంచి 30వరకు జరగనున్న జాతర ఏర్పాట్లను వరంగల్​ కలెక్టర్​ సత్య శారదాదేవి అడిషనల్​ కలెక్టర్​ సంధ్యారాణితో కలిసి బుధవారం పరిశీలించి, రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర, నల్లబెల్లి మద్ది మేడారం జాతర ఏర్పాట్ల పై ముందస్తు ప్రణాళికలతో సమర్ధవంతంగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

 అనంతరం మద్ది మేడారం ప్రధాన పూజారి దురిశెట్టి నాగరాజుతో మాట్లాడి నిర్వహణకు కావల్సిన అవసరాలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్​లో రోడ్డు భద్రత డిస్ట్రిక్​ రోడ్డు సేఫ్టీ కమిటీ డీఆర్ఎస్​సీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆఫీసర్లను ఆదేశించారు.