హాల్ ​టికెట్లు ఇవ్వట్లేదని నిజాం స్టూడెంట్ల నిరసన

హాల్ ​టికెట్లు ఇవ్వట్లేదని నిజాం స్టూడెంట్ల నిరసన

బషీర్​బాగ్, వెలుగు: హాల్ టికెట్లు ఇవ్వట్లేదంటూ బషీర్ బాగ్ లోని నిజాం కాలేజీ స్టూడెంట్లు శనివారం రోడ్డెక్కారు. 75 శాతం అటెండెన్స్ లేదని సాకు చూపుతూ తమ జీవితాలతో ప్రిన్సిపాల్ చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ గేట్​ముందున్న రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 350 మంది డిగ్రీ సెకండ్, థర్డ్ ఇయర్ స్టూడెంట్లకు హాల్ టికెట్స్ అందాల్సి ఉందన్నారు. పోలీసులు చేరుకుని స్టూడెంట్లతో ఆందోళనను విరమింపజేశారు. కాగా, హాల్​టికెట్లు లేకపోవడంతో శనివారం జరిగిన 4వ, 6వ సెమిస్టర్ ఎగ్జామ్స్​ను 350 మంది రాయలేకపోయారు.