Babar Azam: బాబర్ అలా చేయగలిగితే నా యూట్యూబ్ ఛానెల్ ఆపేస్తా: మాజీ క్రికెటర్ ఓపెన్ ఛాలెంజ్

Babar Azam: బాబర్ అలా చేయగలిగితే నా యూట్యూబ్ ఛానెల్ ఆపేస్తా: మాజీ క్రికెటర్ ఓపెన్ ఛాలెంజ్

పాకిస్థాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ అజాం ప్రస్తుత క్రికెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సమీప విష్యత్తులో కోహ్లీ రికార్డ్స్ బ్రేక్ చేయడం బాబర్ అజామ్ కే సాధ్యమని ఇప్పటికీ చాలామంది క్రికెట్ ఫ్యాన్స్, ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. టెస్టులను పక్కనపెడితే వన్డే, టీ20 ల్లో బాబర్ అత్యంత నిలకడ చూపిస్తున్నాడు. అయితే బాబర్ అజాం నిదానంగా బ్యాటింగ్ చేస్తాడు.. అగ్ర శ్రేణి జట్లపై ఆడలేడనే పేరుంది. తాజాగా బాబర్ కు మాజీ పాక్ క్రికెటర్ బాసిత్ అలీ ఛాలెంజ్ విసిరాడు.

అలీ తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. “నేను బాబర్ ఆజంకు సవాలు విసురుతున్నాను. అతను అగ్రశ్రేణి జట్లపై మూడు వరుస సిక్సర్లు కొడితే నేను నా యూట్యూబ్ ఛానెల్‌ని మూసివేస్తాను. USA లేదా ఐర్లాండ్‌పై లాంటి చిన్న జట్లపై కాకుండా బాబర్ ఈ ఫీట్ సాధించాలి. అతను ఈ ఛాలెంజ్‌ని స్వీకరిస్తే నాతో ఛాలెంజ్ కు సిద్ధం కావొచ్చు. అతను ప్రపంచ కప్‌లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టలేకపోతే.. అతను ఓపెనర్ గా రాకూడదు". అని ఈ మాజీ పాక్ క్రికెటర్ అన్నారు. 

పాకిస్థాన్ క్రికెట్ ఆటగాళ్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2024 టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టు ట్రోఫి గెలిస్తే ఒక్కొక్క ఆటగాడికి లక్ష డాలర్ల భారీ బహుమతిని ప్రకటించారు. దీని ప్రకారం ఒకో ఆటగాడికి రూ. 3 కోట్లు అందుకోనున్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఈ విషయాన్ని వెల్లడించి ఆటగాళ్లను ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.  క్రికెట్ వేదికపై పాకిస్థాన్ టైటిల్ గెలవడం కంటే తమకు డబ్బు ఎక్కువ కాదని ఆయన అన్నారు.