V6 News

బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్ సత్నం సింగ్ పై రెండేళ్ల నిషేధం

బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్ సత్నం సింగ్ పై రెండేళ్ల నిషేధం
బాస్కెట్ ‌బాల్‌ ప్లేయర్ సత్నం సింగ్ భమరా పై జాతీయ మాదక ద్రవ్య నిరోధక సంస్థ (NADA) వేటు వేసింది. సింగ్‌పై రెండేళ్లపాటు నిషేధం విధించింది. డోపింగ్‌ పరీక్షల్లో సత్నం సింగ్‌ విఫలమైయ్యాడని NADA తెలిపింది. నేషనల్‌ బాస్కె ట్‌బాల్‌ అసోసియేషన్‌ (NBA) కు భారత్‌ నుంచి ఎంపికైన  మొట్టమొదటి ఆటగాడిగా సత్నం గుర్తింపు పొందాడు. పంజాబ్‌కు చెందిన సత్నం సింగ్ భమరా డల్లాస్‌ మేవెరిక్‌ తరఫున ఆడాడు.