బాసర ట్రిపుల్ ఐటీలో వరుస మరణాలు.. విద్యార్థి సంఘాల ఆందోళన

బాసర ట్రిపుల్ ఐటీలో వరుస మరణాలు..  విద్యార్థి సంఘాల ఆందోళన

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల మరణాలపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ట్రిపుల్ ఐటీ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు నిరసన చేపట్టారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు బైఠాయించారు. విద్యార్థుల మృతికి యూనివర్సిటీ అధికారులే కారణమని ఆరోపించారు. ట్రిపుల్ ఐటీ వీసీని  విద్యార్థులు అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను తిరిగి హాస్టల్లోకి పంపే ప్రయత్నం చేశారు పోలీసులు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. 

బాసర ట్రిపుల్ ఐటీలో  వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. జూన్ 14వ తేదీ బుధవారం దీపిక ఆత్మహత్య చేసుకోగా..జూన్ 15వ తేదీ గురువారం హాస్టల్ భవనం నుంచి లిఖిత అనే విద్యార్థిని దూకి ఆత్మహత్మ చేసుకున్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో హాస్టల్ భవనంపై నుంచి లిఖిత  దూకినట్లు సమాచారం. సమాచారం అందుకున్న బాసర ట్రిపుల్ ఐటీ వీసీ నిర్మల్ జిల్లా ఆస్పత్రిలో లిఖిత మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మరణంపై అధికారుల వద్ద ఆరా తీశారు. అయితే సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన లిఖిత ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడిందని సిబ్బంది చెబుతున్నారు.