రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం : రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య

రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం : రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య
  •     బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య
  •     కలెక్టరేట్​ముందు ఆందోళన

మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గురువారం బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వెరబెల్లి రఘునాథరావు ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 

అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలన్నారు. లక్షెట్టిపేట్ మండలంలో చనిపోయిన నలుగురు కుటుంబాలకు ఒక్కక్కరికి రూ.50 లక్షల ఎక్స్​గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలన్నారు.  పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర గౌడ్, నాయకులు దుర్గం అశోక్, ఏమాజీ, కె.రమేశ్, ఎ.రాజ్ కుమార్, కమలాకర్ రావు పాల్గొన్నారు.

మృతుల కుంటుంబాలకు రూ.50 వేలు అందజేత

లక్సెట్టిపేట: లక్సెట్టిపేటలో రైతుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని లక్ష్మీ నర్సయ్య అన్నారు. మృతిచెందిన రైతుల కుటుంబాలను వెరబెల్లి రఘునాథ్​తో కలిసి పరామర్శించారు. రఘునాథ్ ప్రకటించిన పరిహారాన్ని ఒక్కో కుటుంబానికి రూ.50 వేలు అందజేశారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం కారణంగానే రైతులు మృతి చెందారని ఆరోపించారు.