మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు

మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు
  • ఒక్కేసి పువ్వేసి సందమామ..

ఉమ్మడి మెదక్​ జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పలు గ్రామాలు, పట్టణాల్లో తంగేడు పూలు, గునుగు పూలు, బంతిపూలతో బతుకమ్మలను తయారుచేసి ఆయా కూడళ్లలో పెట్టి సంప్రదాయ పద్దతుల్లో మహిళలు పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా యువతుల సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం బతుకమ్మలను చెరువులు, కుంటల్లోనిమజ్జనం చేశారు. - వెలుగు, న్యూస్​నెట్​వర్క్​