మన బతుకమ్మ ప్రోమో రిలీజ్ టీజీటీడీసీ ఆధ్వర్యంలో రూపకల్పన

మన బతుకమ్మ ప్రోమో రిలీజ్ టీజీటీడీసీ ఆధ్వర్యంలో రూపకల్పన

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప‌‌‌‌‌‌‌‌ర్యాట‌‌‌‌‌‌‌‌క అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) ఆధ్వర్యంలో రూపొందించిన ‘మన బతుకమ్మ– 2025’  పాట‌‌‌‌‌‌‌‌ ప్రోమో విడుదలైంది. మంగళవారం ఈ ప్రోమోను  సామాజిక మాధ్యమాల్లో షేర్  చేశారు. బుధ‌‌‌‌‌‌‌‌వారం రాత్రి 8 గంట‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌కు పూర్తి సాంగ్​ను రిలీజ్ చేయ‌‌‌‌‌‌‌‌నున్నారు. ప్రముఖ ప్రజాకవి, గాయకుడు, ఎమ్మెల్సీ గోర‌‌‌‌‌‌‌‌టి వెంక‌‌‌‌‌‌‌‌న్న అద్భుతమైన సాహిత్యం అందించగా.. సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు. అదితి భవరాజు, మంగ్లీ, గోరటి వెంకన్న ఆల‌‌‌‌‌‌‌‌పించగా.. ఈశ్వర్ పెంటి (ప్రేమలో ఫేమ్) కొరియోగ్రఫీ చేశారు. 

గాజుల భద్రప్ప దర్శకత్వం వహించారు. తెలంగాణ  పల్లె దృశ్యాలు, పండుగ వైభవం చాటేలా శ్యామ్ దుపాటి,  ఉదయ్ గుర్రాల తమ సినిమాటోగ్రఫీతో  అద్భుతంగా తెర‌‌‌‌‌‌‌‌కెక్కించారు. ‘ఓ తంగేడు పూల త‌‌‌‌‌‌‌‌ల్లి బ‌‌‌‌‌‌‌‌తుక‌‌‌‌‌‌‌‌మ్మ’ అంటూ సాగే ఈ పాట‌‌‌‌‌‌‌‌ను  ఆడ‌‌‌‌‌‌‌‌ప‌‌‌‌‌‌‌‌డుచులు ఆడి పాడుకునేలా రూపొం దించారు. 49 సెక‌‌‌‌‌‌‌‌న్ల నిడివి గ‌‌‌‌‌‌‌‌ల ఈ ప్రోమో సోష‌‌‌‌‌‌‌‌ల్ మీడియాలో ట్రెండ్​అవుతోంది.