హైదరాబాద్ కూకట్పల్లిలో బతుకమ్మ షురూ

హైదరాబాద్ కూకట్పల్లిలో బతుకమ్మ షురూ

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లిలో బతుకమ్మ ఉత్సవాలు రెండు రోజుల ముందుగానే కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. వాస్తవానికి అమావాస్యకు ముందు రోజు ఉత్సవాలు ప్రారంభం కావలసి ఉంది. అయితే, ముందు రోజు శుక్రవారం కావటంతో ఆచారం ప్రకారం బతుకమ్మను బయటకు తీసుకువెళ్లకూడదని ముందుగానే ఉత్సవాలను ప్రారంభించారు.

కూకట్​పల్లిలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద గురువారం రాత్రి అధిక సంఖ్యలో బతుకమ్మలతో మహిళలు తరలివచ్చి ఆడారు. అలాగే పీఎన్​ఎం స్కూల్​, మాధవరం కాలనీలో కూడా తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. 18న ఐడీఎల్​ చెరువు వద్ద భారీగా ఉత్సవాలను నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.