
వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ : టీఎన్జీవో జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌లో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. వివిధ శాఖల మహిళా ఉద్యోగినులు బతుకమ్మ ఆడారు. ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొని గౌరీమాతకు పూజలు చేశారు. ఉత్సవాల్లో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు సుమన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ కుమార్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్
కలెక్టరేట్‌లో బతుకమ్మ సంబురాలు
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి కలెక్టరేట్‌లో గురువారం బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారులు, మహిళలు బతుకమ్మ ఆడారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్చంద్ర, ఏఎస్పీ చైతన్యారెడ్డి, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.