ఉత్సాహంగా.. ఎంగిలి పూల బతుకమ్మ

ఉత్సాహంగా.. ఎంగిలి పూల బతుకమ్మ

తొమ్మిది రోజుల బతుకమ్మ సంబురాలు శనివారం ఘనంగా షురూ అయ్యాయి. తొలిరోజు ఆడబిడ్డలంతా తీరొక్కపూలతో ‘ఎంగిలిపూల’ బతుకమ్మలను పేర్చి ఆడి పాడారు. హనుమకొండ జిల్లా వెయ్యిస్తంభాల గుడి వద్ద వేడుకలు వైభవంగా జరిగాయి. రెండోరోజు ఆదివారం ‘అటుకుల బతుకమ్మ’ ఉత్సవాలు జరుగనున్నాయి. 

ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను గ్రేటర్ వాసులు శనివారం సంబురంగా జరుపుకున్నారు. పలు కాలనీలు, బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో యువతులు, మహిళలు బతుకమ్మను పేర్చి ఆడారు. ఓల్డ్ హఫీజ్ పేట, అల్వాల్​, కొత్తపేట, కాచిగూడ, మన్సూరాబాద్, కూకట్​పల్లి, సుందరయ్య పార్కు, బౌద్ధనగర్, పద్మారావునగర్, బోయిగూడ, బన్సీలాల్ పేటలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.