హైదరాబాద్: దివంగత ప్రజానేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పీజేఆర్ 18వ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్లో వారి చిత్రపటానికి టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెం కటస్వామి, అజారుద్దీన్, ఇతర ముఖ్య నేతలు నివాళులు అర్పించారు.
పేద ప్రజలకు అన్ని వేళలా అండగా నిలిచి వారి తరఫున గళం వినిపించిన వ్యక్తి మాజీ మంత్రి పి.జనార్దన్ రెడ్డి అని కొనియాడారు. 1994 నుంచి 1999 వరకు సీఎల్పీ నేతగా పని చేసిన ఆయన నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడారని కితాబిచ్చారు.
తెలంగాణ వాదానికి బలమైన గొంతుకగా నిలిచారన్నారు. పీజేఆర్ అంటే పేరు కాదు.. ఒక బ్రాండ్ అని అన్నారు. పేదలు, కార్మికుల పక్షపాతిగా చివరి శ్వాస వరకు వారి కోసమే తపించారని కొనియాడారు. చివరి వరకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే శ్వాసగా బతికారు.
