ఓటర్లకు రైట్ టు రీకాల్ హక్కు ఉండాలి.. రాజ్యసభలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా

ఓటర్లకు  రైట్ టు రీకాల్ హక్కు ఉండాలి.. రాజ్యసభలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా

న్యూఢిల్లీ: పనితీరు బాగాలేని ఎంపీలు, ఎమ్మెల్యేలను గద్దె దించే అధికారం ఓటర్లకు కల్పించాలని ఆమ్​ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా డిమాండ్​చేశారు. ఈ మేరకు ‘రైట్ టు రీకాల్’ విధానాన్ని తీసుకురావాలని ఆయన అన్నారు. 

బుధవారం రాజ్యసభలో జీరో అవర్ లో మాట్లాడుతూ.. ‘రైట్ టు రీకాల్’ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. ఈ ప్రతిపాదన ప్రకారం.. ఓటర్లు తాము ఎన్నుకున్న ప్రతినిధులు, వారి ఐదేండ్ల కాలపరిమితిలోపు సరిగా పని చేయకపోయినా, దుష్ప్రవర్తనతో నడుచుకున్నా వెంటనే తొలగించే అధికారం ఓటర్లకు ఉండాలని రాఘవ్ చద్దా వాదించారు.