ఆ జిల్లాకు పండుగ తర్వేతే బతుకమ్మ చీరలు

ఆ జిల్లాకు పండుగ తర్వేతే బతుకమ్మ చీరలు

సూర్యాపేట జిల్లా : తెలంగాణ వ్యాప్తంగా సోమవారం నుంచి బతుకమ్మ చీరల పంపిణీ మొదలైంది. రాష్ట్రంలోని గ్రామాలకు బతుకమ్మ చీరలు చేరాయి. అయితే సూర్యాపేట జిల్లాలో మాత్రం బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్ పడింది. హూజూర్ నగర్ ఉప ఎన్నిక అక్టోబర్-21 జరగనుంది. ఎన్నికల కోడ్ ఉండటంతో..సూర్యాపేట జిల్లాలోని ఆడపడుచులకు ఈ సారి బతుకమ్మ చీరలు అందడంలేదు.

ఎన్నికలు ముగిసిన తర్వాత బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తామని తెలిపారు అధికారులు. దీంతో సూర్యాపేట ఆడపడుచులు బతుకమ్మ పండుగకు కాస్త నిరాశకు గురవుతున్నారని తెలుస్తోంది.