కర్నాటకలో సీనియర్ పోలీస్ రాసలీలలు : ఆఫీసులోనే వేర్వేరు మహిళల వీడియోలు వైరల్

కర్నాటకలో సీనియర్ పోలీస్ రాసలీలలు : ఆఫీసులోనే వేర్వేరు మహిళల వీడియోలు వైరల్

పోలీస్.. సాధారణ పోలీస్ కాదు.. పోలీసులకే పోలీస్.. డీజీపీ స్థాయి ర్యాంక్ అధికారి. సీనియర్ పోలీస్ ఆఫీసర్. అతని పేరు రామచంద్రరావు. ఎవరీ రామచంద్రరావు అని సింపుల్ గా చెప్పాలంటే.. సినిమా నటి, బంగారం స్మగ్లింగ్ కేసులో జైలుకు వెళ్లిన రన్యా రావు ఫాదర్.. అదే తండ్రి. ఇప్పుడు కర్నాటక రాష్ట్రంలో సంచలనంగా మారిన.. డీజీపీ స్థాయి పోలీస్ బాస్ రామచంద్రరావు రాసలీలల వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కర్ణాటకలో డీజీపీ స్థాయి ఐపీఎస్ అధికారి రామచంద్రరావు వేర్వేరు మ హిళలతో రాసలీలలు నడిపిస్తున్న వీడియో బయటకు రావటం సంచలనంగా మారింది. ఆఫీస్ టైమ్ లో.. ఏకంగా ఆఫీస్ లో మహిళలను కౌగిలించుకుని.. ముద్దులు పెట్టుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. 

వీడియో ఒక్కటే.. అమ్మాయిలు వేర్వేరుగా ఉన్నారు. నిమిషం ఉన్న ఈ వీడియోలో ముగ్గురు అమ్మాయిలు కనిపించారు.. పోలీస్ బాస్ రామచంద్రరావు సైతం మూడు రకాల దుస్తుల్లో కనిపిస్తారు. ఆఫీసులోని తన సీటులోనే కూర్చుని మరీ అమ్మాయిలతో రాసలీలు చేయటం అనేది వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. వీడియోలో కనిపిస్తున్నది ఒక్క అమ్మాయినేనా లేక వేర్వేరు అమ్మాయిలా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. 

సీనియర్ పోలీస్ ఆఫీసర్ రామచంద్రరావు వ్యక్తిగతానికి సంబంధించి.. అతని అలవాట్లకు సంబంధించి.. అతని పర్సనల్ విషయాలను ప్రశ్నించాల్సిన అవసరం లేదు కానీ.. అతను ఈ రాసలీలలు చేసింది ప్రభుత్వ ఆఫీసులో.. ఉద్యోగం చేయటానికి ఆఫీసుకు వచ్చి.. తన గదిలో.. సీటులో కూర్చుని.. ఆఫీస్ టైమింగ్స్ లో ఇలా చేయటం ఏంటనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. 

పోలీస్ ఆఫీసర్ రామచంద్రరావు రాసలీలల వ్యవహారం ఇప్పుడు కర్నాటక రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. రాజకీయ దుమారం రేపుతోంది. ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి.

ALSO READ | చచ్చి బతికాం.. చచ్చినా మళ్లీ రీల్స్ చెయ్యం అంటున్న యవతులు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు !

పోలీస్ ఆఫీసర్ రాసలీలల వ్యవహారంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత డిపార్టుమెంట్ నుంచి వివరణ కోరారు. విపక్షాల నుంచి విమర్శలు పెరుగుతుండటంతో విచారించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై.. పోలీస్ ఆఫీసర్ రామచంద్రరావు స్పందించారు. ఈ వీడియో మార్ఫింగ్ అంటున్నారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని.. తనను తప్పుగా చూపించేందుకు కుట్ర జరుగుతుందన్నారాయన. గంధపు చెక్కల స్మగ్లింగ్ అడ్డుకున్నందుకు.. తనపై కుట్ర జరుగుతుందని.. మార్ఫింగ్ వీడియోను సోషల్ మీడియాలో తిప్పుతున్నారంటూ వివరణ ఇస్తున్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రామచంద్రరావు.