రేపటి నుంచే కోటి బతుకమ్మ చీరల పంపిణీ

రేపటి నుంచే కోటి బతుకమ్మ చీరల పంపిణీ

రేపటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరలు పంపీణీ చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కోటి బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సారి 24 డిజైన్లు, 10 రంగులలో.. 240 రకాల అంచులతో చీరలుంటాయని చెప్పారు. బతుకమ్మ చీరల కోసం రూ. 339 కోట్ల 73 లక్షలు ఖర్చు చేశామని ప్రకటనలో తెలిపారు.  బతుకమ్మ చీరల కార్యక్రమంతో నేతన్నల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. రేపట్నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపీణీ జరుగుతుందని కేటీఆర్ వెల్లడించారు.  

తెలంగాణ ఏర్పాటు తర్వాత బతుకమ్మ చీరల వంటి వినూత్న కార్యక్రమాలతో.. నేత కార్మికులను అదుకునే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం.. టెక్స్ టైల్ ఉత్పత్తులపై జీఎస్టీ పెంచి నేతన్నలను నిలువునా ముంచే చర్యలు తీసుకుంటుందని విమర్శించారు. కేంద్రం నేతన్నలను, వారి పరిశ్రమను, వారి జీవితాలను పట్టించుకోకున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నేతన్నల కోసం నిబద్ధతతో పనిచేస్తున్నామన్నారు.