ఆన్‌లైన్ గేమ్స్ కు వ్యసనం..ఇంట్లో ఉరేసుకున్న కానిస్టేబుల్

ఆన్‌లైన్ గేమ్స్ కు వ్యసనం..ఇంట్లో ఉరేసుకున్న  కానిస్టేబుల్

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని హర్షగూడ గ్రామానికి చెందిన ముదావత్ శ్రీను (30) అనే బెటాలియన్ కానిస్టేబుల్ ఆన్లైన్ గేమ్స్ వ్యసనానికి బలై  ఆత్మహత్య చేసుకున్నాడు.. కొద్దికాలంగా ఆన్లైన్ గేమ్‌లకు అలవాటు పడి భారీగా డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు అప్పులపాలయ్యారు.దీనివల్ల కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికి గురైన శ్రీను, నిన్న రాత్రి ఇంట్లోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.

సమాచారం అందుకున్న మహేశ్వరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.