గ్రేటర్ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు

గ్రేటర్ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు

గ్రేటర్ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు సందడిగా సాగుతున్నాయి. సోమవారం ఆయా ప్రాంతాల్లో మహిళలంతా ఒక్కచోట చేరి అటుకుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా లీడర్లు గోల్కొండ కోట వద్ద బతుకమ్మ ఆడారు. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని పోలీస్​కమాండ్ కంట్రోల్ సెంటర్​లో షీ టీమ్స్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సిటీ సీపీ ఆనంద్ పాల్గొని మహిళా పోలీసులతో కలిసి కోలాటం ఆడారు. క్రైమ్స్ అడిషనల్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ పాల్గొన్నారు. శామీర్ పేటలోని మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మహిళా అధికారులు, సిబ్బంది బతుకమ్మ ఆడారు. వికారాబాద్ కలెక్టరేట్​ఆవరణలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ నిఖిల పాల్గొన్నారు. హైటెక్స్​లో ‘మన బతుకమ్మ సంబురాలు’ పేరుతో నిర్వహించిన వేడుకల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- వెలుగు, ఖైరతాబాద్/శామీర్ పేట/వికారాబాద్