ఢిల్లీలో బతుకమ్మ సంబురాలు

V6 Velugu Posted on Oct 12, 2021

న్యూఢిల్లీ, వెలుగు: బతుకమ్మ సంబురాలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. సోమవారం తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హన్స్‌‌రాజ్ కాలేజ్‌‌లో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. తెలంగాణ యాస, భాష, కట్టు, బొట్టుకు బతుకమ్మ పండుగ ప్రతీక అని, తెలంగాణ బిడ్డ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈ తొమ్మిది రోజులు బతుకమ్మని పూజిస్తారని చెప్పారు. ఢిల్లీలో బతుకమ్మ సంబురాలు చేసుకోవడం సంతోషంగా ఉందని తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి.వివేక్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి వీ6, విశాక, జేకేఎంఆర్, క్రీమ్ స్టోన్స్, ఇతర సంస్థలు స్పాన్సర్ షిప్ చేశాయని తెలిపారు. ఢిల్లీలో చదువుకుంటున్న తెలుగు స్టూడెంట్లు.. పండుగకు సొంత ఊరికి వెళ్లలేదనే ఈ వేడుకలు నిర్వహించామని అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బిందూ చెప్పారు. నేషనల్ లా యూనివర్సిటీ వీసీ శ్రీకృష్ణదేవరావు, బీజేపీ లీడర్ శ్రీనివాస్,  మహిళలు పాల్గొన్నారు.

Tagged Delhi, students, Batukamma Festival, celebrate

Latest Videos

Subscribe Now

More News