బతుకమ్మ చీరల కొరత.. మహిళల వాగ్వాదం

బతుకమ్మ చీరల కొరత.. మహిళల వాగ్వాదం

హైదరాబాద్: బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే తీరును తప్పుబట్టారు మహిళలు.శంషాబాద్ మున్సిపలిటీ పరిధిలోని, వైఎన్ఆర్ గార్డెన్ లో స్థానిక నేతలు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, తో పాటు అధికార పార్టీ నేతలు పాల్గొన్నారు.  అయితే చీరలు ఇస్తామని మహిళలు, వృద్దలను ఉదయం 10:12 గంటలకే తీసుకొచ్చారు. ఆలస్యంగా వచ్చిన ఎమ్మెల్యే కొంతమంది మహిళలకు మాత్రమే పంపీణీ చేసి వెళ్లడంతో సీరియస్ అయ్యారు.

ఎమ్మెల్యే వెళ్లిన తర్వాత 2 గంటలు నిరీక్షించిన మహిళలకు, వృద్ధులకు బతుకమ్మ చీరలు ఇవ్వకుండా పంపించారు స్థానిక లీడర్లు. వీరికి  చీరలు ఇస్తామని తీసుకొచ్చిన నేతలపై  సీరియస్ అయ్యారు. అటు పింఛను రాకుండా చేశారని.. ఇటు 3గంటలు కూర్చోపెట్టి చివరకు చీర ఇవ్వకుండా పంపిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మమ్మల్ని ఓట్లు వేయించుకుని.. ఇప్పుడు ఏలక్షన్లు లేవు కాబట్టి ఇక మాతో పని ఉండదన్నారు. బతకమ్మ చీరల గురించి లోకట్ లీడర్లను గట్టిగా అడిగితే.. ఇప్పుడు చీరలు అయిపోయాయని..మోహం చాటేశారన్నారు మహిళలు. రాజకీయ నాయకులు ఇలా చేయడం తగదంటూ ఆగ్రహించారు. దీంతో కాసేపు అధికారులు.. ప్రజల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.