ట్రంప్ తారిఫ్తో తమిళనాడుకు తీవ్రనష్టం..ఆదుకోండి: ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ లెటర్

ట్రంప్ తారిఫ్తో తమిళనాడుకు తీవ్రనష్టం..ఆదుకోండి: ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ లెటర్

చెన్నై: భారత్ వస్తువులపై అమెరికా సుంకాలు పెంచిన క్రమంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ట్రంప్ సుంకాల ప్రభావం తమిళనాడు ఎగుమతిదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఎత్తిచూపింది. తక్సణ ఉపశమన చర్యలు తీసుకోవాలని స్టాలిన్ లేఖలో డిమాండ్ చేశారు. 

ఇతర రాష్ట్రాల కంటే తమిళనాడుకే  తీవ్రదెబ్బ

ప్రస్తుత 25శాతం సుంకం 50శాతానికి పెరిగితే తమిళనాడు తీవ్ర ప్రభావాలను ఎదుర్కొంటుందని సీఎం స్టాలిన్ ప్రధాని మోదీకి రాసిన లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం ఎగుమతుల్లో తమిళనాడునుంచే అధికం అన్నారు. దాదాపు 52.1 బిలియన్ డాలర్ల ఎగుమతులు అంటే 31 శాతం తమిళనాడు నుంచి అమెరికాకు వెళ్లిందని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు చాలా తారిఫ్ ప్రభావంతో తమిళనాడు ఎగుమతి దారులకు తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు. 

ప్రమాదంలో కార్మిక-, శ్రామిక రంగాలు

వస్త్రాలు, దుస్తులు, యంత్రాలు, ఆటో భాగాలు, రత్నాలు ,ఆభరణాలు, తోలు, పాదరక్షలు, సముద్ర ఉత్పత్తులు ,రసాయనాలు ఎక్కువగా రంగాలు అధిక శ్రమతో కూడుకున్నవి. ట్రంప్ తారిఫ్ తో ఎగుమతుల్లో మందగమనం ఈ రంగాల్లో భారీ తొలగింపులకు దారితీస్తుందని స్టాలిన్ హెచ్చరించారు.

2024-25లో భారతదేశ వస్త్ర ఎగుమతుల్లో తమిళనాడు 28శాతం వాటా ఉంది. ఇది అన్ని రాష్ట్రాల కంటే అత్యధికం. వస్త్ర రంగంలోనే దాదాపు 75 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.సుంకాలు 25శాతం నుంచి 50శాతం వరకు పెరగడంతో 30 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని అంచనా వేశారు. 

ఉపశమనం కోసం కీలక డిమాండ్లు

పరిశ్రమ సంఘాలతో సంప్రదింపుల అనంతరం GST విలోమ సుంకం నిర్మాణాన్ని సరిదిద్దాలని, ఈ పరిశ్రమపై జీఎస్టీ 5శాతం స్లాబ్ కిందకు తీసుకురావాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. అన్ని రకాల పత్తిపై దిగుమతి సుంకాన్ని మినహాయించాలని కోరారు.

►ALSO READ | సరిహద్దు వివాదాలపై.. ఆగస్టు18న భారత్లో చైనా విదేశాంగ మంత్రి పర్యటన

అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకం (ECLGS) కింద 30శాతం వరకు పూచీకత్తు లేని రుణాలను 5శాతం వడ్డీ రాయితీ ,ప్రధాన చెల్లింపుపై రెండేళ్ల మారటోరియంతో అందించాలని స్టాలిన్ కోరారు. ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల మినహాయింపు (RoDTEP) ప్రయోజనాలను 5శాతానికి పెంచడం,నూలుతో సహా అన్ని వస్త్ర ఎగుమతులకు ప్రీ- ,పోస్ట్-షిప్‌మెంట్ క్రెడిట్‌ను విస్తరించాలని కూడా సూచించారు.

ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కావాలి..

లిక్విడిటీ ,ఖర్చు భారాలను తగ్గించడానికి టారిఫ్ తో దెబ్బతిన్న ఎగుమతిదారులందరికీ ప్రత్యేక వడ్డీ రాయితీ పథకాన్ని స్టాలిన్ డిమాండ్ చేశారు. టారిఫ్ నష్టాలను భర్తీ చేయడానికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTAలు) వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

COVID-19 కాలంలో అమలు చేసిన చర్యల మాదిరిగానే ప్రధాన చెల్లింపులపై తాత్కాలిక నిషేధంతో సహా ప్రత్యేక ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించాలని కోరారు. బ్రెజిల్ పన్ను వాయిదా ,ఎగుమతిదారులకు క్రెడిట్లను అందించినట్లుగానే తమిళనాడుకు అందించాలని డిమాండ్ చేశారు.