వంతెనల భద్రతకు AI టెక్నాలజీ.. కూలిపోయే బ్రిడ్జిలను గుర్తిస్తాయి

వంతెనల భద్రతకు AI టెక్నాలజీ.. కూలిపోయే బ్రిడ్జిలను గుర్తిస్తాయి

వంతెనల నిర్మాణం, నిర్వహణకోసం బీహార్ ప్రభుత్వం కొత్త ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. శనివారం (ఆగస్టు16)  ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) ఢిల్లీతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. AI ఆధారిత వంతెన నిర్వహణ, రియల్ టైమ్ స్ట్రక్చరల్ హెల్త్ మానిటరింగ్ లో ఇంజనీర్లకు అడ్వాన్స్ డ్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. 

బీహార్ లో నిర్మాణంలో ఉన్న వంతెనలు కూలిపోవడం, ఇప్పటికే వంతెనలు కూడా కూలిపోయిన సంఘటన చాలా జరిగాయి. గతేడాది వర్షాకాలంలో కేవలం 15రోజుల స్వల్ప వ్యవధిలో డజనుకు పైగా  వంతెనలు కూలిపోయాయి. ఈ క్రమంలో బీహార్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 

సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే  ఈ కార్యాక్రమం ఆరు నెలలపాటు సాగుతుంది. బీహార్ రాష్ట్ర వంతెన నిర్వహణ, నిర్వహణ విధానం, 2025లో ఇది ఓ భాగం. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్. 

కృత్రిమ మేధస్సు (AI) ,మెషీన్ లర్నింగ్ (ML) టెక్నాలజీలను ఉపయోగించి డ్రోన్ ,సెన్సార్ డేటాను విశ్లేషించడంపై శిక్షణ ఇస్తారు. ఈ డేటా సహాయంతో వంతెనల పరిస్థితిని అంచనా వేస్తారు.

సాంప్రదాయక మానవ తనిఖీలకు బదులుగా డ్రోన్లను ఉపయోగించి వంతెనల నిర్మాణాన్ని నిశితంగా పరిశీలిస్తారు. డ్రోన్‌లు తీసిన ఫోటోలు ,వీడియోలను AI సాఫ్ట్‌వేర్ ద్వారా విశ్లేషిస్తారు.

►ALSO READ | ట్రంప్ తారిఫ్తో తమిళనాడుకు తీవ్రనష్టం..ఆదుకోండి: ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ లెటర్

వంతెనలపై స్ట్రెయిన్ గేజ్‌లు (Strain Gauges) ,టిల్ట్ మీటర్‌లు (Tilt Meters) వంటి సెన్సార్లను అమర్చుతారు. ఇవి వంతెన నిర్మాణంపై ఒత్తిడి ,వంపులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, రియల్-టైమ్ డేటాను అందిస్తాయి.

ఈ డేటా ఆధారంగా ప్రతి వంతెనకు ఒక బ్రిడ్జ్ హెల్త్ ఇండెక్స్ (BHI) స్కోర్‌ను రూపొందిస్తారు. ఈ స్కోర్ ఆధారంగా ఏ వంతెనలకు తక్షణ మరమ్మతులు అవసరమో నిర్ణయిస్తారు.

ఈ ప్రాజెక్ట్ బిహార్‌లోని మౌలిక సదుపాయాల నిర్వహణను పూర్తిగా మార్చడానికి ఓ కీలక చర్యగా భావిస్తున్నారు. ఈ ఆధునిక సాంకేతికత వాడకం వల్ల రోడ్డు భద్రత మెరుగుపర్చడమే కాకుండా ప్రజా ధనం ఆదా అవుతుందని బీహార్ ప్రభుత్వం భావిస్తోంది.